News February 21, 2025
కెరమెరి: చదువుపై దృష్టి సారించాలి: ఐటీడీఏ పీఓ

చదువుపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా విద్యార్థులకు సూచించారు. గురువారం కెరమెరి మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రాంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. రానున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News March 25, 2025
బట్టిపట్టే విధానానికి స్వస్తి పలకాలి: మతిన్ అహ్మద్

జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫ్యాకల్టీ ఎస్.డి మతిన్ అహ్మద్ మంగళవారం సందర్శించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్న సంపూర్ణ సామర్థ్యాలను వెలికి తీయడం ద్వారా వారి భవిష్యత్‌కు బాటలు వేసిన వారమవుతామన్నారు. చదువులో బట్టి పట్టే విధానానికి స్వస్తి పలులుకుతూ.. మ్యాక్ డ్రిల్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్‌లపై అవగాహన కల్పించాలన్నారు.
News March 25, 2025
ADB: వివేక్‌కి శుభాకాంక్షలు తెలిపిన పాయల్ శంకర్

చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. వివేక్‌కు మంత్రి పదవి వచ్చేసిందంటూ పాయల్ శంకర్ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వివేక్ కుటుంబం హడావుడి కొనసాగుతోందంటూ BRS MLA మల్లారెడ్డి ఆటపట్టించగా.. మల్లారెడ్డి జోష్ కొనసాగుతోందని వివేక్ అన్నారు.
News March 25, 2025
ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్నందుకే నాపై కేసులు: కాకాణి

AP: కూటమి ప్రభుత్వం తనపై కావాలనే అక్రమ కేసులు పెడుతుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఆరోపించారు. ‘గతంలో అక్రమాలు జరగలేదని మైనింగ్ అధికారి రిపోర్టు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అక్రమ మైనింగ్ అంటూ కేసు పెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే నాపై కేసులు పెడుతున్నారు. వాటికి భయపడేది లేదు. అక్రమ కేసులపై కోర్టులను ఆశ్రయిస్తా. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి’ అని ఆయన అన్నారు.