News November 10, 2024
కె.వి.పల్లె: APSWR పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య..?
కె.వి.పల్లి మండలం APSWR పాఠశాలలో ఇవాళ ఉదయం విద్యార్థి రెడ్డి మోక్షిత్ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థి హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకోగా తోటి విద్యార్థులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మోక్షిత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News December 8, 2024
తిరుపతి, చిత్తూరుకు రైట్ రైట్ అంటున్న బడా హీరోలు
తెలుగు సినిమా ఉ.చిత్తూరు జిల్లాకు వరుసగా హాయ్ చెబుతోంది. చిత్తూరు నేపథ్యంలో ‘పుష్ప’ ఎంతటి హవా చూపించిందో తెలిసిందే. అంతకన్నాముందు నివేథా థామస్ 35 ఇది చిన్న కథకాదు, శర్వానంద్ శ్రీకారం, కిరణ్ వినరో భాగ్యం విష్ణు కథ సినిమాల షూటింగ్ ఇక్కడే జరిగింది. శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబోలో వస్తున్న ‘కుబేర’ సైతం తిరుపతిలో షూటింగ్ జరిగింది. తమ యాస, భాష సరిహద్దులు దాటుతుందంటూ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
News December 7, 2024
అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్
ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి విదితమే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మార్పులతో కూడిన పథకం అమలు చేయనుంది టీటీడీ.
News December 7, 2024
‘రూ.200 కోట్లు విలువైన భూములను పెద్దిరెడ్డి కబ్జా చేశారు’
రూ.200కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేశారని మదనపల్లెకు చెందిన బాసాని సునీత, రెడ్డి గోపాల్ నాయుడు దంపతులు ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేశ్‌కి ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన కట్టా సులోచనను పెద్దిరెడ్డి బినామీగా పెట్టి మదనపల్లెకు చెందిన 15 కుటుంబాలకు చెందిన భూమికి కబ్జా చేశారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.