News November 7, 2024

కేంద్రం పత్తి రైతులను ఆదుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు

image

కేంద్రం విదేశాల నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసి రాష్ట్రంలోని రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు కాటారంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పత్తి పండించిన రైతులకు సీసీఐ ద్వారా రైతులకు మద్దతు ధర రూ.7,520 కల్పించాలని, రాష్ట్రంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు.

Similar News

News December 6, 2024

సిరిసిల్ల: అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన కేటీఆర్

image

హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు.. బీఆర్ఎస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల మేరకు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.

News December 6, 2024

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు

image

KNR జిల్లాలోని పలు పాఠశాలలు, హాస్టళ్లను విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. స్వచ్ఛమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు.

News December 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్. @ మహాదేవపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ 36వ సారి అయ్యప్ప దీక్ష స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. @ కథలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ ఇల్లంతకుంట మండలంలో చిన్నారిపై పిచ్చికుక్కల దాడి. @ మెట్పల్లి పట్టణంలో అక్రమ ఇసుక రవాణా లారీ పట్టివేత.