News February 13, 2025
కేంద్రమంత్రిని కలిసిన ఎన్టీఆర్ జిల్లా రైతులు

విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్ ప్యాకేజీ- 3కి సంబంధించిన సమస్యలను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరితో కలిసి వారు ఢిల్లీలో గడ్కరీని కలిశారు. ప్యాకేజీ- 3లో సర్వీస్ రోడ్ కేటాయింపు తదితర అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అధికారులతో చర్చించి ఆయా అంశాలను పరిష్కరిస్తామన్నారు.
Similar News
News September 19, 2025
కడప: ఉల్లి రైతులకు శుభవార్త

ఉల్లి సాగు చేసిన రైతులంతా తమ పంటను రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో విక్రయించుకోవచ్చని, ఎటువంటి గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేదని కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. కిలో రూ.12 చొప్పున రైతులు ఉల్లిని విక్రయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News September 19, 2025
జహీరాబాద్: ప్రపంచ సుడోకు ఛాంపియన్షిప్కు తండ్రీకొడుకు

ప్రపంచ సుడోకు ఛాంపియన్షిప్ పోటీలకు జహీరాబాద్కు చెందిన తండ్రీకొడుకులు ఎంపికయ్యారు. మలచెల్మ గ్రామానికి చెందిన ఎం. జైపాల్ రెడ్డి, ఆయన కుమారుడు కార్తీక్ రెడ్డి ఈనెల 21 నుంచి హంగేరిలోని ఎగర్లో జరిగే పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జైపాల్ రెడ్డి 2007 నుంచి జాతీయ, అంతర్జాతీయ సుడోకు పోటీలలో పాల్గొంటూ తన కుమారుడికి కూడా ఈ పోటీలలో పాల్గొనడానికి ప్రోత్సాహం అందిస్తున్నారు.
News September 19, 2025
‘చలో మెడికల్ కాలేజీ’.. వైసీపీ ఆందోళనలు

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై వైసీపీ ‘చలో మెడికల్ కాలేజీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కొందరు ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అని నేతలు విమర్శించారు. ప్రైవేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు #SaveMedicalCollegesInAP అంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది.