News November 28, 2024

కేంద్రమంత్రి దృష్టికి విశాఖ ఉక్కు కార్మికుల సమస్య 

image

కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమార్ స్వామిని న్యూఢిల్లీలో ఆయన కార్యాలయంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై మంత్రితో ఎంపీ చర్చించారు. ముఖ్యంగా ప్లాంట్ ఉద్యోగులు కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్టిల్ ప్లాంట్ కార్మికులు డిమాండ్ చేస్తున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు.

Similar News

News November 18, 2025

సింహాచలం: తోటలో చిరు వ్యాపారి ఆత్మహత్య

image

అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కంచరపాలెంలో 21న జాబ్ మేళా

image

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతుననట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నై‌లో పనిచేయాల్సి ఉంది.