News April 2, 2025

కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్‌లు

image

నల్గొండ కేంద్రీయ విద్యాలయంలో 2వ తరగతి నుంచి 9 వరకు ఆఫ్ లైన్‌లో అడ్మిషన్స్ ఈ నెల 2 నుంచి ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను విద్యాలయంలో పొందవచ్చన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 11 చివరి తేది అని పేర్కొన్నారు.

Similar News

News April 5, 2025

రేషన్ బియ్యంతో సహపంక్తి భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే

image

రేషన్ షాపులో అందజేస్తున్న సన్నబియ్యం పేదింట్లో సంతోషం నింపిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో తెల్లరేషన్ లబ్ధిదారులైన మేడి అరుణ కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు. రాబోయే ఐదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News April 5, 2025

అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్: మంత్రి కోమటి రెడ్డి

image

అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని నల్గొండ పమర్రి గూడ బైపాస్ వద్ద గల బుద్ధ గార్డెన్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 5, 2025

నాగార్జునసాగర్: కిడ్నాప్.. వ్యక్తి హత్య

image

నాగార్జునసాగర్‌లోని హిల్స్ కాలనీలో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాలు.. భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే అంతమొందించాడు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర, బెజవాడ బ్రహ్మం మామా అల్లుళ్లు. వీరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది. దీంతో అతడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపారు.

error: Content is protected !!