News December 7, 2024
కేంద్రీయ విద్యాలయాల ఆమోదం పట్ల ఎంపీ లావు హర్షం

దేశ వ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించిందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. ఇందులో పల్నాటి వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న రొంపిచర్ల, మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించి, ప్రారంభానికి లైన్ క్లియర్ అయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 5, 2025
GNT: జాతీయ రహదారిపై ప్రమాదం.. విద్యార్థిని స్పాట్ డెడ్

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో SRM యూనివర్సిటీ విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. మృతురాలు SRMలో BBA చదువుతున్న మచిలీపట్నానికి చెందిన సుమయ్య (18)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News December 5, 2025
కేఎల్‌యూలో నేడు ‘ఉద్భవ్-2025’ ముగింపు సంబరాలు

వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయ ఏకలవ్య సాంస్కృతిక ఉత్సవాలు ‘ఉద్భవ్-2025’ నేటితో ముగియనున్నాయి. గిరిజన సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ముగింపు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి అతిథులుగా హాజరవుతారు. గిరిజన విద్యార్థుల కళా ప్రదర్శనల అనంతరం, చేతులకు బహుమతులు అందించనున్నారు.
News December 5, 2025
GNT: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆదేశాలు

సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. ధాన్యం కొనుగోలు, ఎరువుల లభ్యత, సీజనల్ వ్యాధుల నియంత్రణ ఇతర ప్రాధాన్య ఆరోగ్య అంశాలపై గురువారం సచివాలయం నుంచి విజయానంద్ అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ వీసీలో పాల్గొన్నారు.


