News March 7, 2025

కేంద్ర ఐటీ చట్టం పౌరుల గోప్యతకు ముప్పు: KTR

image

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టం పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పు అని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. నూతన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారలున్నాయని, నూతన చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాస్తుందన్నారు. ఇది దేశ ప్రజల డిజిటల్ హక్కులపైన కేంద్రం చేస్తున్న దాడి, దేశ ప్రజలు, విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 18, 2026

HYDలో ఫిబ్రవరి 10 డెడ్‌లైన్

image

మేయర్, పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026తో ముగియనుంది. అప్పటివరకు విలీన మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల కింద ఉండనుండగా ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. మార్చి నాటికి డివిజన్ల వారీ ఫైనల్ రిజర్వేషన్ గెజిట్ విడుదల చేసి, ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ఇప్పటికే జలమండలి, రెవెన్యూ విభాగాలను దీనికి <<18882564>>అనుగుణంగా<<>> సిద్ధం చేస్తోంది.

News January 18, 2026

విభజన బ్లూప్రింట్: పోలీస్ కమిషనరేట్లే ప్రామాణికం?

image

మెగా బల్దియాను 3 కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి) విభజించే ప్రతిపాదనపై ప్రభుత్వం రహస్యంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణనే దీనికి ప్రామాణికంగా తీసుకోనున్నారు. పోలీస్ సరిహద్దుల ప్రకారమే కొత్త కార్పొరేషన్ల పరిధి ఉంటే పాలనాపరమైన ఇబ్బందులు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. <<18882495>>300 డివిజన్ల<<>> డేటా అందుబాటులో ఉండటంతో రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకం కలగదు.

News January 18, 2026

బల్దియాలో బీసీ ఓటర్ల గణన: ఇంటింటికీ మొబైల్ సర్వే!

image

TGలోని ఇతర కార్పొరేషన్లలో BC రిజర్వేషన్లు పూర్తయినా GHMCలో మాత్రం ‘ఓటర్ల గణన’ కోసం ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయనుంది. హద్దులు మారిన నేపథ్యంలో ప్రతి డివిజన్‌లో BCల సంఖ్యను తేల్చేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ ద్వారా సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ డిజిటల్ డేటా ఆధారంగానే ఏ వార్డును BCలకు కేటాయించాలో నిర్ణయిస్తారు. <<18882458>>SMలో<<>> వస్తున్న ఊహాజనిత జాబితాను నమ్మవద్దని ఎన్నికల విభాగం హెచ్చరిస్తోంది.