News April 12, 2025
కేంద్ర నిధులు సమర్థవంతంగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే కడియం

జనగామ కలెక్టరేట్లో ‘దిశ’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు వెంటనే ఇందిరమ్మ ఇళ్లను అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు నాలాల మరమ్మతులపై చర్యలు చేపట్టాలని సూచించారు.
Similar News
News October 17, 2025
తుపాకీ వదిలిన ఆశన్న

మావోయిస్టు పార్టీలో మరో శకానికి తెరపడింది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 2రోజుల కింద లొంగిపోగా ఇవాళ ఇంకో టాప్ కమాండర్ ఆశన్న(తక్కళ్లపల్లి వాసుదేవరావు) సరెండర్ అయ్యారు. 25ఏళ్లుగా ఆయన ఎన్నో దాడులకు వ్యూహకర్తగా పనిచేశారు. AP CM చంద్రబాబు, మాజీ CM నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిపై బాంబు దాడితో హత్యాయత్నం, 1999లో IPS ఉమేశ్‌చంద్ర, 2000లో నాటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలకు నేతృత్వం వహించినట్లు ప్రచారం.
News October 17, 2025
అమరావతికి స్టార్ హోటళ్ల కళ

AP: అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా ప్రముఖ స్టార్ హోటళ్లు కొలువుదీరేలా ఏర్పాట్లు చేస్తోంది. దసపల్లా ₹200 కోట్లతో, SGHRL ₹177 కోట్లతో 4స్టార్ హోటళ్లను నెలకొల్పనున్నాయి. VHR సంస్థ అరకులో ₹56 కోట్లతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించడానికి ప్రతిపాదించింది. వీటికి 10 ఏళ్లవరకు SGST, 5 ఏళ్ల వరకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
News October 17, 2025
తొండంగి: వేధింపులు తాళలేక వివాహిత మృతి

భర్త, అత్త వేధింపులు తాళలేక వివాహిత శిరీష (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన తొండంగి (M) గోపాలపట్నంలో జరిగింది. పాతపట్నం మండలం తిడ్డిమికి చెందిన శిరీషకు ఈ ఏడాది మేలో ప్రదీప్‌తో వివాహమైంది. వారు గోపాలపట్నం వచ్చి జీవిస్తున్నారు. అనుమానంతో భర్త, అత్త వేధిస్తున్నారంటూ శిరీష బుధవారం తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. అదే రోజు శీరిష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తొండంగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.