News November 26, 2024

కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి: గడికోట

image

కార్మిక రైతాంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి విడాలని మంగళవారం కార్మిక సంఘాల నేతృత్వంలో రాయచోటి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక పోరాటాలకు ఎలాంటి ప్రభుత్వాలైన పడిపోవాల్సిందేనని, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తమ పార్టీ వామపక్ష పార్టీలతో పనిచేస్తుందని చెప్పారు.

Similar News

News December 2, 2024

ప్రొద్దుటూరు: లాడ్జీలో దారుణ హత్య

image

ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలోని ఓ లాడ్జీలో సోమవారం ఉదయం దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తలపై బీరు సీసాతో కొట్టి హత్య చేసి ఉండచ్చని లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతునికి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 2, 2024

కడప: నేడు జరగాల్సిన వైవీయూ డిగ్రీ పరీక్ష వాయిదా

image

వైవీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సోమవారం జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను రద్దు చేసినట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రద్దయిన పరీక్ష నిర్వహణ తేదీని తర్వాత తెలియజేస్తామన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నేడు జరగాల్సిన పరీక్షలు మాత్రమే రద్దు చేశామన్నారు.

News December 2, 2024

కడప: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

image

రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని (గ్రీవెన్సు) తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ కారణంగా సోమవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నందున కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.