News July 24, 2024
కేంద్ర బడ్జెట్‌పై పాలమూరు ఎంపీలు ఏమన్నారంటే..!
కేంద్ర బడ్జెట్‌లో పాలమూరుకు ఎలాంటి కేటాయింపులు జరగలేదని మల్లురవి అన్నారు. ‘పాలమూరు-రంగారెడ్డి ఊసేలేదు. ఉన్నత విద్యా సంస్థలు, రైల్వే లైన్లు లేవు. జిల్లాకు జరిగిన అన్యాయంపై ఆందోళన చేస్తాం’ అని ఆయన హెచ్చరించారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్ ఉందని DK అరుణ హర్షం వ్యక్తం చేశారు. యువత, మహిళలు, రైతులకు ఎంతో మేలు జరగనుందని, ఉద్యోగులకు ఊరట, PM ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మిస్తారని ఆమె అన్నారు.
Similar News
News January 18, 2025
MBNR: ఇబ్బందులకు గురి చేసే అధికారులను ఉపేక్షించం: మంత్రి జూపల్లి
ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఉపేక్షించబోమని మంత్రి జూపల్లికృష్ణారావు హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి పెంట్లవెల్లికి వచ్చిన మంత్రికి రెవెన్యూ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు, నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో సంబంధిత అధికారులు స్పందించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు.
News January 18, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!
✔క్రికెట్:ఫ్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరిన PU జట్టు
✔బిజినేపల్లి:కల్లు సీసాలో పాము కలకలం
✔పంచాయతీ పోరు..బ్యాలెట్ పత్రాలు సిద్ధం
✔ఉమ్మడి జిల్లాల్లో పెరుగుతున్న చలి
✔వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష.. పాల్గొన్న MLAలు,వైద్యాధికారులు
✔గద్వాల:గొర్రెలను ఢీకొట్టిన లారీ..2 గొర్రెలు మృతి
✔బడి బయటి విద్యార్థులకు గుర్తింపు సర్వే
✔బొంరాస్ పేట:రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
✔రేపు జవహర్ నవోదయ పరీక్ష
✔ఢిల్లీ పీఠం మాదే:DK అరుణ
News January 17, 2025
నల్లమలలో ఘనంగా ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం ఉత్తర ద్వారం, నల్లమల కొండల్లోని శైవ క్షేత్రం శ్రీ ఉమామహేశ్వరం దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి ఛైర్మన్ బీరం మాధవరెడ్డి, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దేవాలయ పరిసరాలు కిటకిటలాడాయి.