News July 23, 2024

కేంద్ర బడ్జెట్‌పై విశాఖకు గంపెడాశలు!

image

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. ఈసారైనా విశాఖ కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు పూర్తిస్థాయిలో నిధులు అందిస్తారా? అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. విశాఖ మీదుగా ఫ్లై ఓవర్ల నిర్మాణం, పోర్ట్ అభివృద్ధిని కోరుకుంటున్నారు.

Similar News

News October 31, 2025

UPSC పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: విశాఖ JC

image

నవంబర్ 2న నిర్వహించనున్న UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3268 మంది హాజరుకానునట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని JC ఆదేశించారు.

News October 31, 2025

విశాఖ: ఆర్టీసీలో డ్రైవర్ పోస్ట్‌ల భర్తీ

image

ఆర్టీసీలో పదోన్నతుల కారణంగా డ్రైవర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయని రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఐటీఐ చేసి 18 నెలల హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారిని ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో అన్‌కాల్ డ్రైవర్‌గా తీసుకోవడం జరుగుతుందని, దగ్గర్లో ఉన్న డిపోల్లో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

News October 31, 2025

విశాఖ: ‘ఫైన్లు ఈ విధంగా చెల్లించాలి’

image

రవాణా శాఖ, పోలీసు డిపార్టుమెంట్ వాహన తనిఖీలలో భాగంగా నమోదైన కేసులల్లో విధించిన ఫైన్లు చెల్లించాలని ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తనిఖీలలో భాగంగా రాసిన కేసులను (https://echallan.parivahan.gov.in/) సైట్ ద్వారా చెల్లించాలన్నారు. రవాణా, రవాణేతర వాహనాల త్రైమాసం పన్నులు, ఇతర సేవలకై vahan.parivahan.gov.in చెల్లించవచ్చన్నారు.