News February 2, 2025

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం: అనంత వెంకటరామిరెడ్డి

image

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసినా కూటమి నాయకులు మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు.

Similar News

News February 10, 2025

సమస్యలు ఉంటే కలవండి: అనంత కలెక్టర్

image

అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామన్నారు. ఆయా శాఖల అధికారులు తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరుకావాలన్నారు.

News February 9, 2025

బ్రహ్మసముద్రం: పురుగు మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య

image

బ్రహ్మసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బొమ్మగానిపల్లి తండా గ్రామంలో లక్ష్మీబాయి అనే వృద్ధురాలు శనివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 9, 2025

అదుపుతప్పి కారు బోల్తా.. మహిళ మృతి

image

కర్నూలు(D) వెల్దుర్తిలోని మంగంపల్లి సమీపాన శనివారం కారు బోల్తాపడి మహిళ మృతిచెందింది. సత్యసాయి(D) బత్తలపల్లి(M) గుమ్మలకుంటకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, మహేశ్వరి(32) HYDలో ఉంటున్నారు. తమ్ముడి వివాహానికి ఏడాదిన్నర కుమారుడు వియాన్స్‌, మరిది అమర్‌నాథ్‌తో కలిసి కారులో బయలుదేరారు. మంగంపల్లి వద్ద కుక్క అడ్డురావడంతో బోల్తాపడింది. తన ఒడిలో ఉన్న వియాన్స్‌ను అదిమి పట్టుకుని ప్రాణాలు కాపాడి, తాను మృతిచెందింది.

error: Content is protected !!