News February 1, 2025

కేంద్ర బడ్జెట్‌‌లో కొత్తగూడెం ప్రజలకు నిరాశే: సీపీఐ

image

కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణం, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగకపోవడం జిల్లా ప్రజలను నిరాశకు గురిచేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే.షాబీర్ పాషా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ వ్యవసాయ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలను పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. రైతులను, నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ధ్వజమెత్తారు.

Similar News

News February 24, 2026

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. హాల్‌టికెట్ తీసుకున్నారా?

image

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఫస్ట్, సెకండియర్ కలిపి 9,97,075 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలు కానుండగా విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలవగా.. ఇంకా తీసుకోనివారు <>tgbieht.cgg.gov.in<<>> సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతిస్తారు. ALL THE BEST

News February 24, 2026

ములుగు: డీజీపీ ఎదుట లొంగిపోయిన దామోదర్

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు 30 ఏళ్ల అజ్ఞాత జీవితం అనంతరం లొంగిపోయాడు. అతనితో పాటు మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఇతర నేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తదితరులు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ‘పోరుకన్నా.. ఊరు మిన్న’ పిలుపు ఫలితమిచ్చింది.

News February 24, 2026

పార్వతీపురం: ‘మార్ట్ ప్రాజెక్టుతో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలి’

image

మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టు అమలుతో జిల్లాలో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పార్వతీపుం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలతో గ్రామీణ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో మార్ట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో ఉండాలన్నారు.