News July 24, 2024

కేంద్ర బడ్జెట్ ఆశాజనకం: ఎంపీ ఉదయ్

image

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజనకంగా ఉందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించడం, పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తికి నిధులు కల్పించడం సంతోషకరమన్నారు.

Similar News

News November 28, 2025

మారిన తూ.గో స్వరూపం.. పెరిగిన ఓటర్ల సంఖ్య

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. మండపేట నియోజకవర్గం అదనంగా చేరడంతో జిల్లాలో మండలాల సంఖ్య 21కి, నియోజకవర్గాల సంఖ్య ఏడు నుంచి ఎనిమిదికి పెరిగాయి. నవంబర్ 11 నాటికి జిల్లా ఓటర్ల సంఖ్య 16,23,528 ఉండగా, మండపేట నియోజకవర్గం చేరికతో మొత్తం ఓటర్ల సంఖ్య 18,37,852 కు పెరిగింది.

News November 28, 2025

తూర్పు గోదావరి జిల్లాలో బడి బస్సులపై ప్రత్యేక డ్రైవ్

image

విద్యాసంస్థలకు చెందిన బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు డీటీఓ ఆర్. సురేశ్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రైవ్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 2,000కు పైగా బస్సులను నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయని డీటీఓ వివరించారు.