News February 1, 2025

కేంద్ర బడ్జెట్.. సత్యసాయి జిల్లాకు వరాలు కురిపించేనా?

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, జిల్లా పరిధిలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రకటన, పాలసముద్రం వద్ద ఏర్పాటవుతున్న బెల్ కంపెనీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి నిధుల కేటాయింపుపై జిల్లా ప్రజలు ఎదరుచూస్తున్నారు. మరోవైపు ఉపాధి హామీకి నిధులు పెరిగితే జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది.

Similar News

News November 27, 2025

తూ.గో.లో మండపేట విలీనం.. పెరగనున్న పట్టణ జనాభా

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూ.గో జిల్లా పట్టణ జనాభా పెరగనుంది. మండపేట నియోజకవర్గాన్ని జిల్లాలో పూర్తిగా కలుపుతూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండపేట మున్సిపాలిటీ జిల్లా పరిధిలోకి చేరనుంది. ప్రస్తుతం రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు పట్టణాలతో కలిపి 4,27,380 ఉన్న జిల్లా పట్టణ జనాభా.. మండపేట చేరికతో 4,80,968కి చేరనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News November 27, 2025

అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పోక్సో కోర్టు జడ్జి వై. వెన్నయ్య నాయుడు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ రాహుల్ మీనా బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం చిరుతపూడికి చెందిన కట్టా బ్రహ్మేశ్వరరావు, అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సత్వర దర్యాప్తుతో నిందితుడికి శిక్ష పడింది.

News November 27, 2025

మెదక్: సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఇవే..

image

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు 30 ఉండనున్నాయి. అందులో ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్ బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబులు, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్ మాన్, మనిషి, తెరచాపతో పడవ, బిస్కట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలి బుడగ ఉంటాయి.