News August 4, 2024
కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన IIIT డైరెక్టర్

నూజివీడులో ఉన్న విద్యార్థులను శ్రీకాకుళం IIIT క్యాంపస్ తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని IIIT డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం క్యాంపస్లోని పలు సమస్యలను కేంద్ర మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు.
Similar News
News November 21, 2025
శ్రీకాకుళం: ‘టెన్త్ పరీక్షల రాసే విద్యార్థులకు గమనిక’

టెన్త్ పరీక్షలకు వయసు చాలని విద్యార్థుల కండోనేషన్ ఫీజుకు వివరాలను సరి చూసి చెల్లించాలని DEO రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31.08.2025 నాటికి 14 సంవత్సరాలు నిండని విద్యార్థుల https://ose.ap.gov.in వెబ్ సైట్లో వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజామాన్యం ఈ విషయాన్ని గమనించాలని, ఎటువంటి అపరాధ రుసుం లేకుండా టెన్త్ పరీక్షల ఫీజును నవంబర్ 30లోగా చెల్లించాలన్నారు.
News November 21, 2025
SKLM: ‘జాబ్ కార్డులు కోసం దరఖాస్తుల స్వీకరణ’

జాబ్ కార్డుల కోసం ధరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయితీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా పంచాయతీలలో గల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కేవైసీ కారణంగా ఆలస్యమైన జాబ్ కార్డులు పరిశీలించి ఇస్తామన్నారు.
News November 21, 2025
సంతబొమ్మాళిలో మహిళ దారుణ హత్య!

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆచూకీ లభ్యమయిందని, మర్డర్కు గురైనట్లు ఎస్సై నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. నందిగామ మండలం కొండబీంపురం గ్రామానికి చెందిన దాసరి పుష్పలత (34) గా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి వరకు పలు సామాజిక మాధ్యమాల్లో మృతదేహం ఫోటోలను పోస్ట్ చేశారు. ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉందన్నారు.


