News August 3, 2024
కేంద్ర మంత్రిని కలిసిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని శ్రీకాకుళం ఎస్పీ కే.మహేశ్వరరెడ్డి శనివారం కలిశారు. కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మహిళా సంరక్షణ, లా అండ్ ఆర్డర్ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీతో కేంద్ర మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. యువత పెడదారిన పడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఈ భేటీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే ఉన్నారు.
Similar News
News December 20, 2025
శ్రీకాకుళం: హాట్ హాట్‌గా జడ్పీ సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళంలో జడ్పీ సర్వసభ్య సమావేశం హాట్ హాట్‌గా సాగుతోంది. ఉపాధి హామీ నిధుల వినియోగం, సచివాలయాలు, RBKల నిర్మాణాల పనుల బిల్లులు రాలేదని సభ్యులు ప్రశ్నించగా సంబంధిత అధికారులు బిల్లులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కలగజేసుకున్నారు. అయితే కేవలం వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పరస్పర ఆరోపణలతో సభ హీట్ ఎక్కింది.
News December 20, 2025
వజ్రపుకొత్తూరు: బీచ్‌లో వెనక్కి వెళ్లిన సముద్రం

వజ్రపుకొత్తూరు మండలంలోని శివ సాగర్ బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఒక్కసారిగా 50 మీటర్ల మేర వెనకకు వెళ్లడంతో పర్యాటకులు ఈ వింతను చూసేందుకు తరలివచ్చారు. దీనికి తోడు ఎంతో తక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.
News December 20, 2025
శ్రీకాకుళంలో సరిపడా యూరియా నిల్వలు

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌కు యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీనాథ స్వామి శుక్రవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధం చేశామన్నారు. అక్టోబరు 1 నుంచి ఇప్పటివరకు 7,811 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలు, మార్క్ ఫెడ్ ప్రైవేట్ డీలర్ల వద్ద 2,020 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు.


