News April 3, 2025

కేంద్ర మంత్రిని కలిసిన కడియం కావ్య

image

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వరంగల్- మామునూర్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్‌కు ఆమోదం తెలిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్, ఎయిర్‌క్రాఫ్ట్ కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆయన్ను కోరారు.

Similar News

News January 9, 2026

సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

image

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్‌ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

News January 9, 2026

నెల్లూరు జిల్లాలో రూ.6675 కోట్లతో పవర్ ప్లాంట్

image

నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు IFFCO kisan SEZలో టాటా సంస్థ 6,675 కోట్లతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమను కేటాయించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా పురోగతి లేని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమల రాకతో యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

News January 9, 2026

తప్పుడు నివేదిక.. TTDకి రూ.118 కోట్ల నష్టం

image

తిరుమల లడ్డూ <<18811889>>కల్తీ నెయ్యి<<>> వ్యవహారంలో విజయభాస్కర్ 2023లో భోలేబాబా కంపెనీ నుంచి రూ.75 లక్షలు, ప్రీమియర్ డెయిరీ నుంచి రూ.8 లక్షలు, అల్ఫా డెయిరీ నుంచి 8 గ్రాముల బంగారంతో పాటు నగదును హవాలా రూపంలో తీసుకున్నాడని తెలుస్తోంది. 2019-2024 వరకు విజయ్ భాస్కర్ ఇచ్చిన ఫేవరబుల్ రిపోర్టు‌ వల్ల TTDకి రూ.118 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు తేల్చారు. కాగా ఈయన నుంచి సిట్ రూ.34 లక్షలు సీజ్ చేసినట్లు సమాచారం.