News October 7, 2024

కేంద్ర మంత్రిని కలిసిన పెద్దపల్లి ఎంపీ

image

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ కట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం తన పర్యటనలో భాగంగా డిల్లీలో మంత్రితో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు శాఖ సంబంధమైన విషయాలను వారిరువురు చర్చించారు. సీఎం వెంట పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి తదితరులున్నారు.

Similar News

News November 11, 2025

ఖమ్మం డీఈఓగా చైతన్య జైనీ బదిలీ

image

ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖాధికారి (డీఈఓ)గా కరీంనగర్ డీఈఓ చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కరీంనగర్ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన చైతన్య జైనీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కాగా, కరీంనగర్ డీఈఓగా డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య కొనసాగనున్నారు.

News November 11, 2025

గంగుల సోదరుడి కుమారుడి పెళ్లి.. కలెక్టర్, CPకి INVITATION

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త గంగుల సుధాకర్ కుమారుడు గంగుల సాయి మనోజ్ వివాహం ఈనెల 13న జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను వారివారి కార్యాలయాల్లో కలిసిన MLA వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు తప్పకుండా హాజరుకావలసిందిగా వారిని గంగుల కోరారు.

News November 10, 2025

చొప్పదండి: 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

గంగాధర మండలం రంగరావుపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన భారీ రేషన్ బియ్యాన్ని సోమవారం విజిలెన్స్ & సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 200 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, బియ్యం నిల్వ చేసిన ఇల్లు ఎవరిది? వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది.