News February 4, 2025
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి సీతక్క

ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
Similar News
News November 23, 2025
కావలి: రైలు కింద పడి యువకుడి దుర్మరణం

కావలి జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు గల యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ T షర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించగలరు.
News November 23, 2025
కడప జిల్లాలో వ్యక్తిపై కత్తితో దాడి.!

ముద్దునూరుకు చెందిన వినోద్ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నర్సింహులు శనివారం కత్తితో దాడి చేసినట్లు స్థానిక SI తెలిపారు. ముద్దనూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్మార్ట్ కిచెన్ పనుల విషయంలో ఈ దాడి జరిగిన ఎస్సై వివరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News November 23, 2025
శబరిమలకు భక్తుల క్యూ.. వారంలోనే 5.75 లక్షల మంది దర్శనం

మండల-మకరవిళక్కు యాత్ర ప్రారంభంతో శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నవంబర్ 16 నుంచి మొదలైన యాత్రలో తొలి వారంలోనే 5.75 లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే సాయంత్రం 7 గంటల వరకు 72,845 మంది సన్నిధానానికి చేరుకున్నారు. వర్షం పడినా యాత్రపై ప్రభావం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు.


