News April 3, 2025
కేంద్ర మంత్రిని కలిసిన వరంగల్ ఎంపీ

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని గురువారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. పలు ప్రాజెక్టులపై చర్చించి అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.
Similar News
News December 21, 2025
పుష్య మాసంలో పర్వదినాలు

DEC 29: కపిలేశ్వర స్వామి తెప్పోత్సవం. 30: ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం. 31: కూర్మ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం. JAN 1: ప్రదోష వ్రతం. 3: శాకాంబరీ పౌర్ణమి. 4: శ్రీవారి సన్నిధిలో ప్రణయ కలహ మహోత్సవం. 6: సంకటహర చతుర్థి. 11: ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం. 14: మతత్రయ ఏకాదశి, భోగి. 15: మకర సంక్రాంతి. 16: కనుమ. 17: ముక్కనుమ, మాస శివరాత్రి, ప్రదోష వ్రతం, సావిత్రి గౌరీ వ్రతం. 18: చొల్లంగి అమావాస్య.
News December 21, 2025
ఓటర్లు తీర్పు ఇచ్చారు.. అప్పులు గుండెల్లో గునపాలు దించాయి!

కామారెడ్డి జిల్లాలో జీపీ ఎన్నికల ఫలితాలు పల్లెల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గెలిచిన వారు సంబరాల్లో మునిగిపోగా, ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి “ముందు నుయ్యి వెనుక గొయ్యి”లా మారింది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో శక్తికి మించి ఖర్చు చేసిన అభ్యర్థులు, ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో ఎవరిని కదిలించినా “పైసలు పాయె.. పదవి రాకపాయె” అనే చర్చ సాగుతోంది.
News December 21, 2025
నేడే పల్స్ పోలియో.. నిర్లక్ష్యం చేయకండి

AP: నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు. తప్పని పరిస్థితుల్లో ఇవాళ మిస్ అయితే రేపు, ఎల్లుండి కూడా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ న్యూస్ షేర్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ను అలర్ట్ చేయండి.


