News January 19, 2025

కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన షెడ్యూల్ 

image

కేంద్ర మంత్రి అమిత్‌షా గన్నవరం పర్యటన షెడ్యూల్ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఉదయం 10.45 గంటలకు విజయవాడలోని నోవాటెల్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించే అమిత్‌షా కొండపావులులోని NIDM ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. 11.15కి అక్కడ భవనాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం 11.35 గంటలకు NDRF పదో బెటాలియన్ క్యాంపస్‌ను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారన్నారు. 

Similar News

News November 14, 2025

స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

image

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.

News November 13, 2025

కృష్ణా: హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు

image

హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కృష్ణా జిల్లా సెషన్స్ జడ్జి గోపి సంచలన తీర్పు ఇచ్చారు. బందరు (M) బుద్దాలపాలెంకు చెందిన కాగిత రామ్మోహనరావు 2013 ఫిబ్రవరి 28న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న శొంఠి పైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వామికృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీర వెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్యకు జీవిత ఖైదు విధించారు.

News November 13, 2025

స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.