News July 19, 2024

కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో ఎంపీ అరవింద్ భేటీ

image

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌తో శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు అరవింద్ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు విషయాలను చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగనున్న నేపథ్యంలో ఇరువురు భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Similar News

News November 15, 2025

కఠోర శ్రమతోనే లక్ష్య సాధన: కలెక్టర్

image

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు నిత్యం కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె మాట్లాడుతూ.. బాలబాలికలు అనవసర విషయాలను పట్టించుకోకుండా, తమ ధ్యాసనంతా చదువుపైనే కేంద్రీకరించాలని సూచించారు.

News November 15, 2025

KNR: టాస్క్ జాబ్ మేళాకు విశేష స్పందన.. 54 మంది షార్ట్‌లిస్ట్

image

KNR IT టవర్‌లోని టాస్క్ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 209 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని టాస్క్ ప్రతినిధులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించగా, 54 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అయ్యారు. వీరికి త్వరలో తుది రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని వారు వెల్లడించారు.

News November 15, 2025

కరీంనగర్: బ్లూ కోల్ట్స్ విభాగంలో మహిళ పోలీస్ కానిస్టేబుళ్లు సత్తా

image

బ్లూ కోల్ట్స్ విభాగంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని మహిళ పోలీస్ కానిస్టేబుళ్లు రాణిస్తున్నారు. 2016లో అప్పటి సీపీ కమలహాసన్ రెడ్డి పురుషల బ్లూ కోల్ట్స్‌ను ప్రారంభించారు. మహిళా పోలీసుల సంఖ్య క్రమంగా పెరగడంతో సీపీ గౌష్ ఆలం సెప్టెంబర్‌లో మహిళ బ్లూ కోల్ట్స్ సేవలను ప్రారంభించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, కమ్యూనిటీ సమావేశాలుతో పాటు అన్ని విభాగాలలో పురుష పోలీసులతో సమానంగా రాణిస్తున్నారు.