News June 6, 2024
కేంద్ర మంత్రి వర్గ రేసులో బండి సంజయ్!

KNR లోక్‌సభ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన BJP అభ్యర్థి బండి సంజయ్‌కి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సంజయ్‌ని ఆ పదవి నుంచి తప్పించినప్పుడు మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఆయనకు అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి పెద్దపీట వేశారు. ఇప్పుడు ఆ హోదాతోనే ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమని చెబుతున్నారు.
Similar News
News October 14, 2025
KNR: కష్టపడిన వారికే పార్టీలో సముచిత స్థానం

పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా సముచిత స్థానం దక్కుతుందని ఏఐసీసీ పరిశీలకుడు, హంగల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మానే స్పష్టం చేశారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీసీసీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం ఏఐసీసీ ఆదేశాల ప్రకారం, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు.
News October 14, 2025
KNR: మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కార్యక్రమం

‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా, మత్తు పదార్థాల అనర్థాలపై జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు చర్చించారు.
News October 14, 2025
డీసీసీ ఎన్నికల పరిశీలకుడిని కలిసిన KNR కాంగ్రెస్ నేతలు

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అబ్జర్వర్‌గా వచ్చిన కర్ణాటక హంగల్ ఎమ్మెల్యే మనే శ్రీనివాస్‌ను సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించినట్లు సమాచారం.