News March 12, 2025
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకి తప్పిన ప్రమాదం

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని పార్లమెంట్ సమావేశానికి హాజరై అనంతరం మంత్రిత్వశాఖ కార్యాలయానికి వెళ్తుండగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆయన కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. వర్మ కాలికి తీవ్ర గాయమైంది. వైద్య బృందం ప్రత్యేక చికిత్స అందించారు. కాలికి బలమైన గాయం కావడం వల్ల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఢిల్లీ నుంచి భీమవరానికి ఆయన బయలుదేరారు.
Similar News
News March 16, 2025
ప.గో.జిల్లా వ్యాప్తంగా 128 టెన్త్ పరీక్ష కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 128 సెంటర్ల ద్వారా 22,432 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. నారాయణ తెలిపారు. వీరిలో 11,407 మంది బాలురు కాగా 11,025 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు.
News March 16, 2025
మొగల్తూరు: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

ప.గో జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మొగల్తూరు SI నాగలక్ష్మి వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల బాలికపై అదే ఊరికి చెందిన జయరాజు(34) అత్యాచారం చేశాడు. ఈ ఘటన 11వ తేదీన జరగ్గా.. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నరసాపురం DSP శ్రీవేద ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
News March 16, 2025
TPG: కన్నతండ్రే కిల్లర్‌లా చంపేశాడు..!

కన్నతండ్రే కిల్లర్‌లా ఇద్దరు చిన్నారులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే. చంద్రకిశోర్ ఇద్దరి చిన్నారులను ప్రముఖ స్కూల్‌లో చదివిస్తున్నాడు. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా? అనే భయం మొదలైందని బంధువులు చెబుతున్నారు. ఒకేసారి ఇద్దరు పిల్లలకు కాళ్లుచేతులకు తాళ్లు ఎలా కట్టగలిగాడు? వారిని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ఎలా చంపగలిగాడనేది అనుమానంగా ఉందని వారు చెప్పారు.