News June 6, 2024
కేఈ కుటుంబం నుంచి మూడోతరం ఎమ్మెల్యే
కేఈ కుటుంబం నుంచి మూడో తరం అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. కేఈ కృష్ణమూర్తి కుమారుడు టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవిపై 14,211 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేఈ మాదన్న 1967లో కర్నూలు నుంచి గెలుపొందగా.. ఆయన కుమారడు కేఈ కృష్ణమూర్తి డోన్ నుంచి 1978 నుంచి 1989 వరకు వరసగా నలుగుసార్లు గెలుపొందారు. అంతేకాకుండా ఆయన టీడీపీ ప్రభుత్వంలో నీటీపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు.
Similar News
News December 10, 2024
నంద్యాల-నందిపల్లె రైల్వే స్టేషన్ల మధ్య వ్యక్తి మృతి
నంద్యాల-నందిపల్లె రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివరాలు తెలియ రాలేదన్నారు. మృతుడు పసుపు, తెల్లని రంగు ఫుల్ హాండ్స్ టీ షర్టు, ఎరుపు, పసుపు కలర్ షార్ట్ ధరించినట్లు చెప్పారు. ఎవరైనా గుర్తిస్తే రైల్వే నంద్యాల పోలీసులను సంప్రదించాలి అన్నారు.
News December 10, 2024
Rain Alert: కర్నూలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 08518 277305కు ఫోన్ చేయాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
News December 10, 2024
11, 12 తేదీల్లో రాయలసీమలో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 11, 12 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పంట కోతలు పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని తెలిపింది.