News August 29, 2024
‘కేజీహెచ్‌కు అనుమానాస్పద కేసు రాక’

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన వ్యక్తి (44) శరీరంపై ఎర్రటి, నల్లటి పొక్కులతో బుధవారం రాత్రి కేజీహెచ్‌కు వచ్చాడు. కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అతని నుంచి నమూనాలు సేకరించి మంకీపాక్సా కాదా అనేది నిర్ధారించడానికి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ శివానంద తెలిపారు. ముందు జాగ్రత్తగా తదుపరి పరీక్షల నిమిత్తం నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు.
Similar News
News October 18, 2025
ఈనెల 20న PGRS రద్దు: కలెక్టర్

ఈ నెల 20వ తేదీన దీపావళి పండగ సందర్బంగా ఆరోజు కలెక్టరెట్లో జరగనున్న PGRS రద్దు చేసినట్లు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం ప్రకటించారు. తదుపరి వారం నుండి PGRS యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈవారం PGRS రద్దు విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి కలెక్టరెట్‌కు రావద్దని సూచించారు.
News October 18, 2025
జిల్లాలో 2,645 హెక్టార్లలో ఆయిల్ ఫాం సాగు: కలెక్టర్

జిల్లాలో ప్రస్తుతం 2,645 హెక్టార్ల విస్తీర్ణంలో అయిల్ పామ్ సాగు అవుతుందని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం రూరల్ మండలం కొండకరకాంలో సాగు అవుతున్న ఆయిల్ పామ్ తోటను కలెక్టర్ సందర్శించారు. 2025-26 సంవత్సరానికి 26 మండలాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా గుర్తించడం జరిగిందని 1850 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. శత శాతం రాయితీతో మొక్కలు పంపిణీ చేస్తామన్నారు.
News October 18, 2025
VZM: బాల సంరక్షణ కేంద్రాలకు ధ్రువపత్రాల పంపిణీ

బాలల సరంక్షణా కేంద్రాలకు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం ధృవప్రతాలను పంపిణీ చేశారు. జిల్లాలోని మూడు బాల సదనాలు, ఒక చిల్డ్రన్ హోమ్, ఒక శిశుగృహ హోమ్, 4 చైల్డ్ కేర్ ఎన్జిఓ హోమ్స్ కు ఫైనల్ సర్టిఫికెట్స్ అందజేశారు. జిల్లాలోని శిశు సంరక్షణ సంస్థలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి ఈ జిల్లా స్థాయి తనిఖీ కమిటీ పనిచేస్తుందని ఆయన తెలిపారు.