News August 29, 2024

‘కేజీహెచ్‌కు అనుమానాస్పద కేసు రాక’

image

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన వ్యక్తి (44) శరీరంపై ఎర్రటి, నల్లటి పొక్కులతో బుధవారం రాత్రి కేజీహెచ్‌కు వచ్చాడు. కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అతని నుంచి నమూనాలు సేకరించి మంకీపాక్సా కాదా అనేది నిర్ధారించడానికి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ శివానంద తెలిపారు. ముందు జాగ్రత్తగా తదుపరి పరీక్షల నిమిత్తం నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు.

Similar News

News September 8, 2024

విజయనగరం జిల్లా వాసులకు అలర్ట్

image

విజయనగరం జిల్లాలో ఆదివారం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

News September 8, 2024

పార్వతీపురం పురపాలక సంఘంలో కంట్రోల్ రూమ్

image

తుఫాను హెచ్చరికల దృశ్య పార్వతిపురం పురపాలక సంఘ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే 08963221053 కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.

News September 7, 2024