News February 28, 2025
కేజీహెచ్‌లో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!

KGHలో ఓ నకిలీ డాక్టర్ బాధితుని వద్ద రూ.లక్ష కాజేసిన ఘటన వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన దూసి రామ్‌జీ కొంతకాలంగా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. వీరు కిడ్నీ అవసరమని పేపర్లో ప్రకటన ఇవ్వగా ఓ వ్యక్తి నకిలీ డాక్టర్ అవతారం ఎత్తి రూ.లక్ష కాజేశాడు. మోసపోయాయని గ్రహించిన రాంజీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విశాఖ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 20, 2025
దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.
News March 20, 2025
విశాఖ నుంచి వెళ్లే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు

సామర్లకోట-రావికంపాడు మధ్యన ఆటో మేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సింహాద్రి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23,24 తేదీల్లో గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ అదే విధంగా విశాఖ – గుంటూరు సింహాద్రి, 24న ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను రెండు వైపులా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
News March 20, 2025
సంచిలో ట్రాన్స్‌జెండర్ తల, చేయి లభ్యం

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింది. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేపట్టి చనిపోయింది దీపుగా గుర్తించారు. అయితే ఆమె తల, మరో చేయి అనకాపల్లి వై జంక్షన్ వద్ద సంచిలో దొరికాయి.