News February 7, 2025
కేజీహెచ్‌లో బాలిక ప్రసవం.. మరణించిన శిశువు
కేజీహెచ్‌లో <<15384408>>బాలిక ప్రసవించిన <<>>ఘటనలో విషాదం చోటుచేసుకుంది. నెలలు నిండకముందే ఆరునెలల మగబిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ బాలిక భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కళాశాలలో చదువుతుంది. ప్రేమ పేరుతో శారీరకంగా కలిసిన ఓ యువకుడు ఆమెను గర్భవతి చేశాడు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చీడికాడ స్టేషన్‌కు కేసు బదిలీ చేసినట్లు భీమిలి సీఐ సుధాకర్ తెలిపారు.
Similar News
News February 7, 2025
విశాఖ: టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మరో నామినేషన్
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం నాలుగు నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. పీఆర్టీయూ మద్దతుతో బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, స్వతంత్ర అభ్యర్థులు నూకల సూర్యప్రకాష్,రాయల సత్యన్నారాయణ, పోతల దుర్గారావు తమ మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు.ఇప్పటి వరకు మొత్తం 8 నామినేషన్లు వచ్చాయి.
News February 7, 2025
విశాఖ బీచ్ రోడ్డులో మురీ మిక్చర్ తింటున్నారా?
విశాఖ బీచ్ రోడ్డులో మురీ మిక్చర్ తీనేవారికి చేదువార్త. న్యూస్ పేపర్‌లో మురీమిక్చర్ తింటే క్యాన్సర్ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జి.ఏ.బి నందాజీ తెలిపారు. ఈ మేరకు మురీ మిక్చర్ అమ్మె చిరు వ్యాపారులకు గురువారం అవగాహక కల్పించారు. ప్రింటింగ్ న్యూస్ పేపర్లో అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలని వారికి సూచించారు. ఎఫ్ఎస్ఐ మార్కు ఉన్న పేపర్‌ప్లేట్లు వినియోగించాలన్నారు.
News February 7, 2025
కేజీహెచ్‌లో బాలిక ప్రసవం
కేజీహెచ్‌లో 17 ఏళ్ల బాలిక ప్రసవించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాకు చెందిన బాలిక భీమిలిలోని ఓ హాస్టల్‌లో చదువుతోంది. కడుపునొప్పి రావడంతో కేజీహెచ్‌లో చేర్పించగా నెలలు నిండని మగబిడ్డ పుట్టి.. చనిపోయినట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు విచారణ చేస్తున్నారు. ఓ యువకుడు పెళ్లి పేరుతో ఆమెకు దగ్గరైనట్లు గుర్తించారు.