News January 20, 2025

కేజ్రీవాల్‌పై అంబర్‌పేట్ వాసి పోటీ..!

image

HYD అంబర్‌పేట్ వాసి దుగ్గిరాల నాగేశ్వరరావు న్యూఢిల్లీ 40వ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన పోటీ చేస్తున్నారు. ఈ మేరకు జాతీయ జనసేన పార్టీ తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలో విద్యాభ్యాసం చేసిన నాగేశ్వరరావు అంబర్‌పేట్‌లో ఉంటున్నారు. తన పార్టీ గుర్తు గ్రీన్ చిల్లి అని తెలిపారు. ఇటీవల ఆయన వయనాడ్‌లో ప్రియాంకా గాంధీపై పోటీ చేశారు.

Similar News

News February 12, 2025

కొత్తూరు: దర్గాను దర్శించుకున్న హీరో విశ్వక్ సేన్

image

HYD శివారు షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరులోని జేపీ దర్గాను ప్రముఖ సినీ హీరో విశ్వక్‌సేన్ దర్శించుకున్నారు. త్వరలో విడుదల కానున్న తన సినిమా లైలా హిట్ కావాలని కుటుంబసభ్యులతో కలిసి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి దర్గాకు వస్తుండే వాడినని, ఈ మధ్యకాలంలో రాలేకపోయానన్నారు.

News February 12, 2025

HYD: కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది: కునంనేని

image

కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ముగ్ధూం భవన్‌లో ఆయన మాట్లాడుతూ..‘కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది. ప్రజా ప్రతినిధులు ఫోన్‌లు ఎత్తడం లేదు. సిస్టం ఫాలో అవడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసొస్తే పోటీ చేస్తాం. లేకపోతే బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం’ అన్నారు.

News February 12, 2025

రేషన్ కార్డ్‌లపై అదనపుఛార్జి వసూలు చేస్తే కాల్ చేయండి

image

కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు వచ్చే పేద ప్రజలు మీ సేవ కేంద్రంలో ఆన్‌లైన్ సేవల రుసుము ₹45 మాత్రమే చెల్లించాలి. రసీదుపై ప్రింటైన రుసుమ కంటే నయా పైసా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు అని తెలిపారు. అదనంగా వసూలు చేస్తే 040-45676699 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!