News February 11, 2025

కేజ్రీవాల్ అహంకారంతోనే ఢిల్లీలో ఓటమి: జగ్గారెడ్డి

image

కేజ్రీవాల్ అహంకారంతోనే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన మళ్లీ పుంజుకుంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని చెప్పారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి లేదని వివరించారు.

Similar News

News November 22, 2025

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

image

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన CISF సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా అనుమానిత వస్తువులను పరిశీలించారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన

image

AP: బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD తెలిపింది. ఇది సోమవారానికి వాయుగుండంగా మారి బుధవారానికి తుఫానుగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ప్రకాశం, NLR, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.