News March 13, 2025
కేటిదొడ్డి: ‘చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి’

నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఎడమ కాలువ 104వ ప్యాకేజీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గురువారం కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె, కొండాపురం, మైలగడ్డ గ్రామాల వద్ద సాగునీటి ఆవశ్యకత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువలను పరిశీలించారు. రైతుల అభ్యర్థన మేరకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
Similar News
News October 17, 2025
భద్రతా ప్రమాణాలు పాటిస్తూ బాణసంచా వ్యాపారం నిర్వహించుకోవాలి: సీపీ

భద్రతా ప్రమాణాలను పాటిస్తూ బాణసంచా విక్రయాలు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ విక్రయదారులకు సూచించారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ కమిషనరేట్ పరిధిలోని బాణసంచా విక్రయదారులతో కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీలు, అగ్నిమాపక, అదనపు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.
News October 17, 2025
KNR: SU పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో రేపు(OCT 18) జరగనున్న ఎంఎడ్ 2వ సెమిస్టర్, బీ ఫార్మసీ 2వ సెమిస్టర్, ఎల్ఎల్ఎం 4వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయనున్నట్టు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు. వాయిదా వేసిన ఎంఎడ్, బి ఫార్మసీ పరీక్షలు OCT 22న, ఎల్ఎల్ఎం పరీక్ష OCT 29 న జరుగుతాయని పేర్కొన్నారు. మిగిలిన పరీక్షల తేదీలలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.
News October 17, 2025
DRDOలో 105 ఉద్యోగాలు

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(LRDE)లో 105 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైన వారు అర్హులు. NOV 4న బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైన వారు ఏడాది పాటు పనిచేయాలి.
వెబ్సైట్: https://www.drdo.gov.in/
* మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.