News March 13, 2025
కేటిదొడ్డి: పంట పొల్లాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్

కేటిదొడ్డి మండలం కొండాపురం, గువ్వలదిన్నె గ్రామాల్లో వరి పొలాలను గురువారం జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, వ్యవసాయ అధికారులతో కలిసి పర్యటించారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా ఆయకట్టు కింద పొలాలకు సాగు నీరందడం లేదని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కలెక్టర్ పర్యటించారు. ఆయకట్టు కింద సాగు నీరందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 7, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లిపోంది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెలైన్ హోంకు తరలించారు.
News February 7, 2026
ఒక్క మ్యాచ్.. ఎన్నో రికార్డులు!

*U19 WC ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన తొలి క్రికెటర్ వైభవ్.
* ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోరు- 722 రన్స్ (ఇండియా-411, ఇంగ్లండ్-311)
*పరుగుల పరంగా ఫైనల్‌లో అతిపెద్ద విజయం- 100 రన్స్
*Youth ODIలో అత్యధిక సిక్సులు- 31
*ఛేజింగ్‌లో హయ్యెస్ట్ స్కోరు- 311 రన్స్(ఇండియాతో కలిసి ఇంగ్లండ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది)
*ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
News February 7, 2026
MHBD: అభ్యర్థుల చుట్టూ జనాలే.. ఓట్లు ఎవరికో..?

మహబూబాబాద్, తొర్రూర్, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్ మున్సిపాలిటీలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ప్రతి అభ్యర్థి వెంట భారీ సంఖ్యలో జనాలు తిరుగుతున్నారు. ఈ ఓటర్లు చివరికి.. ఓటు ఎవరికి వేస్తారు ఎవరిని అందలం ఎక్కిస్తారోనని పలువురు చర్చించుకుంటున్నారు. ఈనెల 13 వరకు వేచి చూడాల్సిందే.


