News January 31, 2025
కేడీ, డీసీ, రౌడీ సస్పెక్టులకు సీపీ కౌన్సిలింగ్

సిద్దిపేట జిల్లాలోని కేడీ, డీసీ, రౌడీ సస్పెక్టులకు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 17, 2025
మలికిపురం: ఇద్దరు పిల్లలతో సహా వ్యక్తి అదృశ్యం

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన సిరిగినీడి దుర్గాప్రసాద్ ఇద్దరు పిల్లలతో సహా సోమవారం అదృశ్యమయ్యాడు. ఇద్దరు పిల్లలను ఆధార్ కార్డుల కోసం మధ్యాహ్నం ఇంటి నుంచి తీసుకువచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దిండి చించినాడ వారధిపై బైకు, జోళ్లు విడిచి పిల్లలతో సహా అదృశ్యమయ్యాడు. పిల్లలతో సహా నదిలో దూకాడా లేక ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని వెళ్లాడా అన్నది మిస్టరీగా మారింది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించిన కలెక్టర్

టేక్మాల్ మండలంలో వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా అన్ని గ్రామాల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.