News January 31, 2025
కేడీ, డీసీ, రౌడీ సస్పెక్టులకు సీపీ కౌన్సిలింగ్

సిద్దిపేట జిల్లాలోని కేడీ, డీసీ, రౌడీ సస్పెక్టులకు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 10, 2025
5 కిలోమీటర్లకు 5 గంటల సమయం

కుంభమేళాకు వెళ్లిన ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 300 కి.మీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. 5 కి.మీ 5 గంటల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి ట్రాఫిక్ ఉండటంతో చాలామంది ఇంకా UPలోకే ఎంటర్ కాలేదు. ఇక త్రివేణీ సంగమానికి చేరుకోవడం గగనంలా మారింది. గంటలకొద్దీ వాహనాల్లోనే కూర్చోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News February 10, 2025
భామిని: ఇసుక ర్యాంప్ గుంతలలో మునిగిపోయి వ్యక్తి మృతి

భామిని మండలంలోని బిల్లుమడ పంచాయతీ పరిధి పాత బిల్లుమడ గ్రామానికి చెందిన కోటిలింగాల చక్రో (70) వంశధార నదీ తీరంలో స్నానానికి వెళ్లి మృతి చెందాడు. నదిలో ఇసుక ర్యాంప్ గుంతలో నీటిలో మునిగిపోయి మరణించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానిక గ్రామస్థులు హుటాహుటిన నదీ తీరానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 10, 2025
ప్రశాంతమైన జీవితానికి 8 సూత్రాలు

– ఎదుటివారు చెప్పేది విన్నాక మాట్లాడు
– ఎక్కువ గమనించు
– తక్కువ మాట్లాడు
– ఎప్పుడూ నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు
– నేర్చుకోవడం మానేయకు
– ఈగో, వాదించడం, కోపాన్ని కంట్రోల్ చేసుకో
– ఎక్కువ నవ్వుతూ తక్కువ చింతించు
– ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అని తెలుసుకో