News July 10, 2024
కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ స్పందన

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమిపై కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తమ అంచనాలకు అతీతంగా జరిగాయన్నారు. తన మిత్రుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజూ ప్రజల్లో ఉన్నా ఓడిపోయారన్నారు. అందువల్ల ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడంవల్ల ఓడిపోయారని చెప్పడానికి కూడా లేదన్నారు. జగన్ చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి ఆయనవైపే ఓటర్లు ఉంటారని భావించామని పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
గుత్తిలో వ్యక్తి మృతి

గుత్తిలోని కర్నూల్ రోడ్డులో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 12, 2025
శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి: ఎస్పీ

శాంత్రిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీలేకుండా పనిచేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల ఛేదనకు టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై అలసత్వం వహించకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు.
News November 11, 2025
సిలిండర్ పేలి అనంతపురంలో వ్యక్తి మృతి

అనంతపురంలోని తపోవనంలో గ్యాస్ సిలిండర్ పేలి జిలాన్ బాషా (34) మృతిచెందారు. చిన్న సిలిండర్‌లో మోనో అమెనియం ఫాస్పేట్ నింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు జీజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.


