News November 8, 2024
కేతిరెడ్డి మరదలు వసుమతికి నోటీసులు!
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నీటి పారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిక్కవడియార్ చెరువులో ఆక్రమణలు జరిగాయని, ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమారు 20 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం.
Similar News
News December 4, 2024
‘స్థిరమైన వృద్ధిరేటు సాధనకు కృషి చేద్దాం’
శ్రీ సత్యసాయి జిల్లాలో బ్యాంకర్ల భాగస్వామ్యంతో స్థిరమైన వృద్ధిరేటు సాధనకు కృషి చేద్దామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో లక్ష్యసాధన ప్రగతిపై బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు భాగస్వాములతో సమన్వయం చేసుకొని అర్హత కలిగిన వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 4, 2024
అనంతపురం జిల్లా వాసులకు ఫ్రీగా కారు డ్రైవింగ్ శిక్షణ
అనంతపురం రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచితంగా కారు డ్రైవింగ్ నేర్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ విజయ లక్ష్మి తెలిపారు. ఈనెల 18 నుంచి జనవరి 17 శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. వయసు 19 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. శిక్షణలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. ఆసక్తిగల వారు అనంతపురంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News December 4, 2024
అనంతపురం జిల్లాలో భూప్రకంపనల ప్రభావం లేదు!
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూ ప్రకంపనల ప్రభావం అనంతపురం జిల్లాపై లేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, 2017లో బెళుగుప్ప మండలం జీడిపల్లి, 2019లో ఉరవకొండ మండలం అమిద్యాలలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిన విషయం తెలిసిందే.