News July 30, 2024

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి కీలక బాధ్యతలు?

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీలో కీలక మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే పలు జిల్లాలకు అధ్యక్షులను మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎం.శంకరనారాయణకు పార్టీలో మరో బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 22, 2026

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

జిల్లాలో సోమవారం నుంచి జరగబోయే ఇంటర్ పరీక్ష కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లు మూసి వేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

News February 22, 2026

1100 కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

image

జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి “మీ కోసం” కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. పెండింగ్ అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.ap.gov.inలో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈనెల 23న కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తారు.

News February 22, 2026

కంబదూరు మండలంలో విషాదం

image

కంబదూరు మండలం మర్రిమాకుల పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండి బోల్తా పడటంతో గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు(57) మృతి చెందారు. ఈయన ఎద్దుల బండిని తోలుకుంటూ పొలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.