News June 6, 2024

కేతిరెడ్డి సొంత వార్డులో బీజేపీదే మెజారిటీ

image

గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడీయా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన కేతిరెడ్డి 3,734 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 9వ రౌండ్‌కి 11వేల మెజారిటీతో ఉన్న ఆయనకు 12వరౌండ్ నుంచి మెజారిటీ తగ్గుతూ వచ్చింది. 20వ రౌండ్‌కు సత్యకుమార్(BJP) 4,138 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. ధర్మవరం ఓటర్లు బీజేపీకి మెుగ్గు చూపాగా..తన సొంతవార్డు 21వ వార్డులో 712 ఓట్లల..బీజేపీకి 419, కేతిరెడ్డికి 269 ఓట్లు పడ్డాయి.

Similar News

News November 28, 2025

జర్నలిస్టులకు అనంతపురం కలెక్టర్ గుడ్ న్యూస్

image

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఆదేశాల మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. పొడిగించిన గడువు 1.12.2025 నుంచి 31.1.2026 వరకు ఉంటుందని కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు జర్నలిస్టులందరూ గమనించగలరు.

News November 28, 2025

గుత్తి రైల్వే ఉద్యోగి భార్య సూసైడ్

image

గుత్తి ఆర్ఎస్‌లోని రైల్వే ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉన్న క్వార్టర్స్‌లో నివాసముండే అసిస్టెంట్ లోకో పైలట్ రాహుల్ కుమార్ సతీమణి జ్యోతి (23) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్ మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో జ్యోతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News November 27, 2025

గుంతకల్లు: రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన రాజేశ్

image

గుంతకల్లు పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి రాజేశ్ వినుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలలో పాల్గొని 200, 400, 4×1000 పోటీలలో ప్రథమ స్థానం సాధించి లక్నోలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్ జాతీయ పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చారని అభినందించారు.