News March 11, 2025

కేతేపల్లిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

వనపర్తి జిల్లాల్లో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో 24 గంటల్లో పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో జిల్లాలో అత్యధికంగా 37.0 ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేర్ 36.7, వెలుగొండ 36.5, రేమోద్దుల, ఆత్మకూర్‌లో 36.3, దగడపల్లి, శ్రీరంగాపూర్‌లో 36.0, పానగల్ 35.9, విలియం కొండ 35.7, వీపనగండ్ల 35.3, పెద్దమందడి, మదనాపూర్‌లో 35.2, గోపాల్‌పేట్, కానాయిపల్లి, వనపర్తిలో 35.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News December 9, 2025

నక్కపల్లిలో పర్యటించిన జపాన్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ బృందం

image

జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం నక్కపల్లి మండలంలో పర్యటించింది. ఆర్సిలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం కేటాయించిన భూములను పరిశీలించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ కోసం బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్‌పురం, రాజయ్యపేట, వేంపాడు పరిధిలో 2,164.31ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.

News December 9, 2025

ఏలూరు జిల్లా చరిత్రలోనే మొదటిసారి..!

image

ఏలూరు బార్ అసోసియేషన్ నుంచి మహిళా న్యాయవాది జిల్లా అదనపు న్యాయమూర్తిగా ఎంపికవడం తొలిసారి అని ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారామ్ పేర్కొన్నారు. జిల్లా అదనపు న్యాయమూర్తిగా ఎంపికైన గుంటూరు దుర్గాపూర్ణిమను అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఇది ఒక చరిత్రాత్మక ఘటన అన్నారు.

News December 9, 2025

TPT: ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఫోన్‌పే చేయడంతోనే!

image

తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్ ఓ బాలికను అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఆ బాలిక ఫోన్ పే ద్వారా నగదు చెల్లించింది. ఆ నంబర్‌తో బాలికకు కాల్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. తర్వాత సాయి కుమార్ తన అక్కతో ఫోన్ మాట్లాడించాడు. ఫ్రెండ్స్‌గా ఉందామని.. ఏ అవసరం వచ్చినా కాల్ చేయడమన్నాడు. దీంతో బాలిక సాయం అడిగితే తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.