News March 30, 2025

కేదార్‌నాథ్ యాత్రికులకు అన్నదానం అభినందనీయం: హరీశ్ రావు

image

సిద్దిపేటకు చెందిన అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో కేదార్‌నాథ్‌లో యాత్రికులకు అన్నదానం చేయడం అభినందనీయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మే 2న కేదార్‌నాథ్‌లో జరిగే అన్నదానం కార్యక్రమాన్ని ఆదివారం సిద్దిపేట కాంప్ కార్యాలయంలో హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News November 28, 2025

సత్యసాయి జిల్లా యువతికి అరుదైన ఛాన్స్

image

​సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంభాలట్టికి చెందిన దీపికకు అరుదైన గౌరవం దక్కింది. టీమ్ ఇండియా అంధుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను గెలిపించిన దీపిక, గురువారం జట్టు సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దీపిక ప్రధానితో ఫొటో దిగారు. ప్రధాని మోదీ ఆమెను అభినందించారు.

News November 28, 2025

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్- 2025 లోగో ఇదే!

image

భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లకు సంబంధించిన పురోగతిని సీఎం స్వయంగా తెలుసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమ్మిట్‌కు సంబంధించిన లోగోను తాజాగా విడుదల చేశారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఈ సమ్మిట్‌లో ప్రధాన అంశమని అధికారులు తెలిపారు.

News November 28, 2025

కరీంనగర్: NMMSS ‘కీ’ విడుదల

image

8వ తరగతి విద్యార్థులకు ఈనెల 23న నిర్వహించిన NMMSS స్కాలర్ షిప్ అర్హత పరీక్ష KEY విడుదలైందని కరీంనగర్ DEO మొండయ్య తెలిపారు. కీ పేపర్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6 వరకు http/bse.telangana.gov.in సైట్‌లో లేదా dirgovexams.tg@gmail.comకి పంపాలని అన్నారు. లేదా డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు, హైదరాబాద్ నందు సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 6 తరువాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబడవని అన్నారు.