News March 30, 2025
కేదార్‌నాథ్ యాత్రికులకు అన్నదానం అభినందనీయం: హరీశ్ రావు

సిద్దిపేటకు చెందిన అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో కేదార్‌నాథ్‌లో యాత్రికులకు అన్నదానం చేయడం అభినందనీయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మే 2న కేదార్‌నాథ్‌లో జరిగే అన్నదానం కార్యక్రమాన్ని ఆదివారం సిద్దిపేట కాంప్ కార్యాలయంలో హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
NLG: ప్రతి మూడో ఆదివారం.. బుద్ధవనం టూర్!

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్‌కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు
News April 20, 2025
జూరాల నుంచి నీటిని విడుదల చేయలేం: వనపర్తి కలెక్టర్

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. జూరాల ప్రాజెక్టు గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయినందున, తాగునీటి అవసరాలకు తప్ప సాగుకు ప్రస్తుతం నీటిని విడుదల చేయలేమని అన్నారు. కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి జూరాలకు కొంత నీటిని విడుదల చేసే విధంగా చూడాలని మంత్రిని కలెక్టర్ కోరారు.
News April 20, 2025
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ

ఖమ్మం: నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా చేపట్టాలని మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క అన్నారు. శనివారం మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 1317 మంది రైతుల నుండి రూ.24.66 కోట్ల విలువ గల 10628.760 మెట్రిక్ టన్నుల సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించినట్లు అదనపు కలెక్టర్ మంత్రులకు వివరించారు.