News March 25, 2025
కేబినెట్ విస్తరణ.. హైదరాబాద్కు NO ఛాన్స్..!

మంత్రి వర్గ విస్తరణలో HYD, ఉమ్మడి RRకు చెందిన ఒక్క కాంగ్రెస్ MLAకు ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశం కొలిక్కి వచ్చింది. శ్రీగణేశ్ (కంటోన్మెంట్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), రామ్మోహన్ రెడ్డి(పరిగి), మనోహర్ రెడ్డి (తాండూర్), ఆరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలే యాదయ్య (చేవెళ్ల) ఉండగా ఎవరికీ ఛాన్స్ దక్కలేదని సమాచారం.
Similar News
News October 30, 2025
ఉమెన్స్ వరల్డ్కప్లో రికార్డు

మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా సౌతాఫ్రికా ప్లేయర్ మారిజానె కాప్(44W) నిలిచారు. నిన్న ENGతో సెమీస్లో 5 వికెట్లు తీసిన ఆమె, భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి(43)ని అధిగమించారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో లిన్ ఫుల్స్టన్(39), మేఘన్ షుట్(39), కరోల్ హోడ్జెస్(37), సోఫీ ఎక్లెస్టోన్(37) ఉన్నారు. కాగా నిన్న SFలో మారిజానె కాప్ బ్యాటింగ్లోనూ విలువైన 42 రన్స్ చేశారు.
News October 30, 2025
పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి: కలెక్టర్

రానున్న రెండురోజులలో జిల్లా అంతటా పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి బుధవారం అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో వరదనీరు నిల్వ లేకుండా చూడాలన్నారు.
News October 30, 2025
లాభాలు పొందిన వారు వెనక్కి ఇవ్వాలి: సీపీ

అద్విక ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందినవారంతా వాటిని వెనక్కి ఇవ్వాలని సీపీ రాజశేఖర్ బాబు ప్రతిపాదించారు. లేనిపక్షంలో సంస్థ ఎండీ శ్రీవెంకట ఆదిత్య దంపతుల మాదిరిగా కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, దర్యాప్తు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించి, వారికి నగదు బహుమతులు అందజేశారు.


