News June 13, 2024
కేబినేట్లో పిన్న వయస్కుడిగా శ్రీనివాస్

యువ నేతలతోపాటు సీనియర్లతో ఏపీ మంత్రి మండలి కొలువుదీరిన సంగతి తెలిసిందే. CMచంద్రబాబు తప్పితే మిగిలిన 23 మంది మంత్రుల్లో వయసు పరంగా చూస్తే.. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్(40) అతి పిన్న వయస్కుడిగా ఉన్నారు. అందరికంటే పెద్ద వయస్కుడిగా ఎన్ఎండీ ఫరూక్(74) ఉన్నారు. మన జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొండపల్లికి ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.
Similar News
News January 9, 2026
VZM: ‘పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి’

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం సాయంత్రానికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కనీసం 80% పాసుపుస్తకాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
News January 9, 2026
VZM: ‘పీహెచ్‌సీల్లో వైద్యసేవలు మెరుగుపడాలి’

విజయనరం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను మెరుగుపరిచి ఓపిని పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆయా శాఖాధికారులను ఆదేశించారు. పీహెచ్సీ వైద్య సేవలపై కలెక్టర్ కార్యాలయం నుంచి శుకవ్రారం వీడియో కాన్ఫరెన్స్‌తో సమీక్షించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ సర్వేపైనా చర్చించారు. పీహెచ్‌సీల వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపిని రోజుకి 50కి పెంచాలని ఆదేశించారు.
News January 8, 2026
నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించండి: SP

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నేర సమీక్షను నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. అన్ని కేసుల్లో ఈ-సాక్ష్య యాప్ వినియోగం, సీసీటీఎన్ఎస్లో వివరాల అప్లోడ్ తప్పనిసరి అన్నారు. ఎన్బీడబ్ల్యూ అమలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలన్నారు.


