News February 17, 2025
కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిమ్ ఇక్బాల్ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.
Similar News
News January 8, 2026
వేద పారాయణారుల మార్కుల పరిశీలన పూర్తి

టీటీడీ 700 మంది వేద పారాయణదారుల నియామకం కోసం గతనెల ఇంటర్వూలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వివిధ వేదాలు వేద పండితులు మార్కులను టీటీడీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలన పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
News January 8, 2026
అసెంబ్లీకి రాని వైసీపీ MLAలకు నోటీసులు!

AP: అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగా వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. నిపుణుల అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు.
News January 8, 2026
గ్రేటర్ వరంగల్లో 13 నర్సరీల్లో మొక్కల పెంపకం

గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రజలకు అవసరమైన మొక్కలు అందించడానికి అధికారులు నర్సరీలో మొక్కల పెంపకం చేస్తున్నారు. 13 నర్సరీల్లో 5 లక్షలకు పైగా మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. మరో 10కి పైగా నర్సరీలను పునరుద్ధరించి మొక్కలు నాటేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో పర్యావరణానికి సంబంధించి, పూలు పండ్లకు సంబంధించిన మొక్కలను ఎక్కువగా పెంచుతున్నట్లు పేర్కొన్నారు.


