News February 17, 2025
కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిమ్ ఇక్బాల్ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.
Similar News
News February 26, 2026
చెరువులను నింపడమే లక్ష్యం: కలెక్టర్

పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువ ద్వారా 195 చెరువులను నింపే ప్రక్రియను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన అధికారులతో కలిసి కాలువ పనులు, పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. హంద్రీ-నీవా కాలువ 344.90 కిలోమీటర్ (జనకంపల్లి – పుట్టపర్తి రోడ్డు) వద్ద పనులను పరిశీలించారు.
News February 26, 2026
కలెక్టర్‌ను కలిసిన పాలకొండ పీఆర్ ఈఈ రాధారాణి

పాలకొండ పంచాయతీ రాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.రాధారాణి గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, పాలకొండ డివిజన్ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు.
News February 26, 2026
సిరిసిల్ల: మైనార్టీ టూవీలర్ దరఖాస్తుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లోని మైనార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ టూవీలర్ మోపెట్ పథకం దరఖాస్తుల పరిశీలన గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ సలీం, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మహమ్మద్ హమీద్, జిల్లా ప్రధాన కార్యదర్శి షబ్బీర్, ఉపాధ్యక్షుడు హైదర్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు అనీఫ్ భావన్, చాంద్ మియా తదితరులు పాల్గొన్నారు.


