News March 2, 2025
కేయు: రీసెర్చ్‌స్కాలర్స్ హాస్టల్ జాయింట్ డైరెక్టర్‌గా సాంబశివరావు

కాకతీయ యూనివర్సిటీలోని వివేకానంద రీసెర్చ్‌స్కాలర్స్ హాస్టల్ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ అంకశాల సాంబశివరావు నియమితులయ్యారు. ఈమేరకు శనివారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను సాంబశివరావు అందుకున్నారు. నియామక పత్రాన్ని అందుకున్న సాంబశివరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Similar News
News March 17, 2025
IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.
News March 17, 2025
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
News March 17, 2025
ధర్మవరం: చిగిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం.

ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న బోయ నారాయణ స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా ద్విచక్ర వాహనంలో వస్తుండగా చిగిచెర్ల వద్ద మరో వాహనం ఢీకొనడంతో నారాయణ స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నారాయణ స్వామి మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపించారు.