News April 8, 2025
కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News April 20, 2025
సిద్దిపేట: అగ్నివీర్ దరఖాస్తులు

యువకుల నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రాబాద్లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT
News April 20, 2025
నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఖమ్మం

ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు సాయంత్రం వరకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాగే జిల్లాలోని పలుచోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజులు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
News April 20, 2025
IPL PLAYOFFS: ఏ జట్టు ఎన్ని గెలవాలంటే?

IPL 2025లో అన్ని జట్లు కనీసం 7 మ్యాచులు ఆడాయి. దాదాపు అన్ని జట్లూ ప్లే ఆఫ్స్ పోటీలోనే ఉన్నాయి. GT 7 మ్యాచుల్లో 3, DC 7 మ్యాచుల్లో 3, PBKS 7 మ్యాచుల్లో 3, LSG 6 మ్యాచుల్లో 3, RCB 7 మ్యాచుల్లో 4, KKR 7 మ్యాచుల్లో 5, MI 7 మ్యాచుల్లో 5, SRH 7 మ్యాచుల్లో 6, CSK 7 మ్యాచుల్లో 6, RR 6 మ్యాచులకు ఆరు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.